తెలంగాణలో ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన విద్యా కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేసింది. ఇవాళ సచివాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావిధానంపైన 'ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ' పేరుతో ఉన్న నివేదికను సీఎంకు అందజేశారు.కాగా, జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సెప్టెంబరు 2024లో ప్రత్యేక తెలంగాణ విద్యా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆకునూరి మురళి చైర్మన్‍గా ఏర్పాటైన ఈ కమిషన్ పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యత మెరుగుదల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాలపై నివేదికలు సమర్పిస్తూ విద్యా సంస్కరణలకు కృషి చేస్తోంది. కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకించే అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి నూతన విద్యాపాలసీ రాష్ట్రంలో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాతీయ విద్యా విధానం తరహాలో ప్రత్యేక విద్యా విధానం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
الخميس، 26 فبراير 2026
Chief Minister Revanth Reddy report titled 'Education Policy for Telangana' Special Education Policy on the Pattern of National Education Policy telangana
ليست هناك تعليقات:
إرسال تعليق