మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకున్న సంబంధాలపై తొలిసారి బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అది తాను చేసిన "చాలా పెద్ద తప్పు" అని అంగీకరించారు. అంతేకాకుండా, తన మాజీ భార్య మెలిందాతో వివాహ బంధంలో ఉన్నప్పుడు ఇద్దరు రష్యన్ మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని సంచలన విషయాన్ని బయటపెట్టారు. మంగళవారం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫౌండేషన్ ఉద్యోగులతో సమావేశమై తన వైఖరిని స్పష్టం చేశారు. "ఎప్స్టీన్‌తో సమయం గడపడం నేను చేసిన పెద్ద పొరపాటు. నేను చేసిన తప్పు వల్ల ఈ వివాదంలోకి లాగబడిన ప్రతీ ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాను," అని గేట్స్ పేర్కొన్నారు.
ホーム
/
technology
/
జెఫ్రీ ఎప్స్టీన్‌తో సంబంధాలపై బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బిల్ గేట్స్
الخميس، 26 فبراير 2026
Bill Gates publicly regrets his relationship with Jeffrey Epstein He admitted that it was a "very big mistake" he made science technology
ليست هناك تعليقات:
إرسال تعليق