ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న సమయంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ తరహాలో స్పందించారు. వ్యాన్ సీటుపై కూర్చుని, గెడ్డం కింద చేయి పెట్టి 'తగ్గేదేలే' అనే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లాటరీలో భారీ అవినీతి జరిగిందని జనసేన నాయకులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. గత నెల 31 నుండి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబుకు ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ మంజూరైంది. అయితే, తాజా పీటీ వారెంట్ నేపథ్యంలో ఆయనను కోర్టుకు తీసుకువస్తుండటంతో గుంటూరు కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు రాకతో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
కోర్టు ప్రాంగణంలో పోలీసు వ్యాన్‌లోనే 'తగ్గేదేలే' మేనరిజాన్ని ప్రదర్శిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చిన అంబటి
الخميس، 12 فبراير 2026
Ambati Rambabu poses for the cameras in a police van while displaying the 'Thaggedele' gesture in the court premises Andhra Pradesh guntur viral on social media
ليست هناك تعليقات:
إرسال تعليق