తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు కొనసాగించారు. మొదట రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో ఈసా-మూసీ నదుల సంగమ ప్రాంతంలో చేపట్టనున్న "గాంధీ సరోవర్ ప్రాజెక్టు" శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు కేవలం అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా, చారిత్రక ప్రాధాన్యం కలిగిన స్థలాన్ని సంరక్షించే ప్రయత్నమని సీఎం వివరించారు. 1948లో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఈ సంగమ ప్రాంతంలో కలిపిన చారిత్రక సందర్భాన్ని ఆయన రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో బాపుఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించబడిందని సీఎం తెలిపారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణపై ఆయన పలు ప్రతిపాదనలు ముందుంచారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. కొత్తగూడెం విమానాశ్రయానికి పాల్వంచ ప్రాంతంలో స్థలం గుర్తించినందున OLS సర్వే, సాధ్యాసాధ్యత అధ్యయనం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించిన విషయాన్ని తెలియజేస్తూ, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అదనంగా ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన 249 ఎకరాలకు పైగా భూమి సిద్ధంగా ఉందని కేంద్రానికి సమాచారం అందించారు. రాజకీయ పరంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఉంది. బుధవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం సమావేశమై దావోస్ పర్యటన, హార్వర్డ్ శిక్షణ కార్యక్రమం, మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర పరిపాలన, రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన పార్టీ నాయకత్వానికి వివరించారు.
రాజ్‌నాథ్ సింగ్‌ను "గాంధీ సరోవర్ ప్రాజెక్టు" శంకుస్థాపనకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
الخميس، 12 فبراير 2026
he met several Union Ministers invites Rajnath Singh to lay the foundation stone of "Gandhi Sarovar Project" Revanth Reddy telangana Today
ليست هناك تعليقات:
إرسال تعليق