ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గత రెండేళ్లలో 31 శాతం తగ్గినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజూమ్‌దార్ రాతపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించారు. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, గత మూడేళ్లలో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య నిరంతరం తగ్గుతూ వస్తోంది. 2023లో 9.08 లక్షల మంది, 2024లో 7.7 లక్షల మంది, 2025లో 6.26 లక్షల మంది వెళ్లారు. అంటే, 2023తో పోలిస్తే 2025 నాటికి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య సుమారు 2.82 లక్షల మేర తగ్గింది. విదేశాల్లో చదువు అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల ఆర్థిక స్థోమత, బ్యాంక్ రుణాల లభ్యత, మరియు మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు దీనిపై ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. అయినప్పటికీ, విజయవంతమైన ప్రవాస భారతీయులు దేశానికి గొప్ప ఆస్తి అని, వారి సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధికి వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటివరకు 14 విదేశీ విద్యాసంస్థలు ఈ అనుమతులు పొందాయని ఆయన వెల్లడించారు.
తగ్గుతున్న విదేశీ చదువుల మోజు : రెండేళ్లలో 31 శాతం తగ్గిన విద్యార్థుల సంఖ్య
الخميس، 12 فبراير 2026
9.08 lakh people went Declining foreign study craze In 2023 in 2024 7.7 lakh people went and in 2025 6.26 lakh people went national Number of students down by 31 per cent in two years
ليست هناك تعليقات:
إرسال تعليق