ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి చేసి నగలను దోచుకున్న ఆటో డ్రైవర్

الخميس، 12 فبراير 2026

Auto driver attacks teacher with knife crime Gudur Rural Mandal Kandali Motorists noticed her and took her to the hospital and informed the police Nellore district of Andhra Pradesh steals jewelry

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరు రూరల్‌ మండలం కందలి వద్ద  స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను ఆటో డ్రైవర్ దోచుకున్నాడు. రక్తమోడుతున్న ఉపాధ్యాయురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. వాహనదారులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. గూడూరుకు చెందిన హరిత (35) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గూడూరు నుంచి నిత్యం స్కూలుకు వెళ్లి వస్తుంటారు. ఈ రోజు ఉదయం స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేసిన ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను ఆపి కత్తితో హరితపై దాడి చేశాడు. ఆపై నగలను దోచుకుని కత్తిపోట్లతో రక్తమోడుతున్న హరితను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు హరితను గమనించి ఆసుపత్రికి తరలించారు. వాహనదారుల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఆటోడ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హరితను నెల్లూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ