Ad Code

అమెరికాలో భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మిస్సింగ్ : ఐదు రోజులుగా అమెరికా పోలీసులు గాలింపు


మెరికాలో కర్ణాటకకు చెందిన విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని కోసం ఐదు రోజులుగా అమెరికా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ మిస్సింగ్‌పై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాకేత్ అమెరికా కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. సాకేత్ చివరిసారిగా క్యాంపస్‌కు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బర్క్‌లీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాలు సహా నగరవ్యాప్తంగా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించకలేదు. ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సాకేత్ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని, వారి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అమెరికా అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu