తెలంగాణ లోని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఖాదర్ పేట ప్రధాన రహదారి వద్ద నిద్రమత్తులో రోడ్డు పక్కన ఉన్న చెట్టును బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వరంగల్ పట్టణంలోని కరీమాబాదుకు చెందిన బొమ్మగాని అనిల్ (35) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో శుభకార్యానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో శనివారం తెల్లవారుజామున వస్తుండగా ఖాదర్ పేట శివారులో రోడ్డు క్రాస్ దగ్గర ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొన్నాడు. పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వేగంగా దూసుకెళ్లి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
0 Comments