మరాఠీ నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానేపై పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగిన ముంబైలోని అంధేరి కోర్టుకు పలాష్ తన న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారేతో కలిసి వచ్చారు. పలాష్ పై విజ్ఞాన్ మానే తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. సినిమా పెట్టుబడి పేరుతో పలాష్ తనకు రూ.40 లక్షలు మోసం చేశాడని మానే ఆరోపించారు. అలాగే క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ సంబంధం గురించి కూడా ఆయన పలు ఆరోపణలు చేశారు. స్మృతి తండ్రి ద్వారా తనకు పలాష్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తన దగ్గరి నుంచి సినిమా పెట్టుబడి పేరుతో రూ.40 లక్షలు తీసుకున్నాడని, కానీ తిరిగి ఇవ్వలేదని మానే చెప్పారు. స్మృతి – పలాష్ పెళ్లి రోజున పలాష్ మరొక మహిళతో పట్టుబడ్డాడని, అందుకనే స్మృతితో తన వివాహం ఆగిపోయిందని కూడా మానే పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మహారాష్ట్రలోని సాంగ్లిలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, దురుద్దేశంతో కూడుకున్నవని పలాష్ పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా విజ్ఞాన్ మానేకు రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపానని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలాష్ మాట్లాడుతూ తన ఇమేజ్, కెరీర్‌కు హాని కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఇదే టైంలో విజ్ఞాన్ కూడా తనకు నోటీసు అందినట్లు ధృవీకరించారు. పలాష్ – స్మృతి మంధానల వివాహం రద్దు అయిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. స్మృతి మంధాన – పలాష్ ల వివాహం రద్దు అయిన సంగతి తెలిసిందే.
విజ్ఞాన్ మానేపై పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
الثلاثاء، 27 يناير 2026
maharashtra Mane alleged that Palash cheated him out of Rs. 40 lakhs national Palash Muchhal files Rs. 10 crore defamation suit against Vignyan Mane
ليست هناك تعليقات:
إرسال تعليق