పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘర్షణలతో తమను ఎప్పుడూ బిజీగా ఉంచాలనే వ్యూహాలను భారత్ అనుసరిస్తోందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్థాన్ ఘర్షణల నేపథ్యంలో భారత్‌పై ఆసిఫ్ ఈ నింద మోపారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ తో తాజా ఘర్షణలు ఆపేందుకు ఖతార్, టర్కీ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని ఖవాజా అన్నారు. అయితే తూర్పు, పశ్చిమ సరిహద్దుల ఘర్షణల్లో తాము నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలు, ఆపరేషన్ సింధూర్‌ను ప్రస్తావిస్తూ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అవసరమైతే వాటిని బయటపెడతామన్నారు. ఇంతకుముందు కూడా భారత్ తరఫున ఆఫ్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ ఆసిఫ్ వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ వాసులు అక్రమంగా ఉండటాన్ని పాక్ అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తిందని ఆసిఫ్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే దానికి ఆ దేశమే జవాబుదారీగా ఉంచే నిబంధనలు చర్చల్లో ఉన్నాయన్నారు. తమవైపు నుంచి ఎలాంటి శత్రు కార్యకలాపాలు జరగడం లేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటీవల పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ కొనసాగింపునకు రెండు దేశాలు ఇటీవల అంగీకరించాయి. సయోధ్య కుదిర్చేందుకు టర్కీ, ఖతార్‌లు ప్రయత్నిస్తున్నాయి.
ఘర్షణలతో తమను ఎప్పుడూ బిజీగా ఉంచాలనే వ్యూహాలను భారత్ అనుసరిస్తోంది !
الأحد، 2 نوفمبر 2025
in an interview with a news agency India is following strategies to keep us busy with conflicts international Pakistan Defense Minister Khawaja Asif
ليست هناك تعليقات:
إرسال تعليق