హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన డాక్టర్ జాన్ పాల్ అద్దె ఇంట్లో ఈ డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. తన స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ లతో కలిసి ఈ డ్రగ్స్ డెన్ ప్రారంభించాడు. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లోనే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో రైడ్ చేశారు. జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ ను పోలీసులు గుర్తించారు. ఓజీ కుష్, ఎండిఎంఎ, ఎల్ ఎస్ డీ బాస్ట్స్, కొకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ పాల్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో దాదాపు రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డాక్టర్ జాన్ పాల్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడి స్నేహితులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
الثلاثاء، 4 نوفمبر 2025
a resident of Musheerabad cocaine Criem Dr. John Paul gummus and hashish oil drugs were seized hyderabad LSD busts MDMA OG Kush Police seize drugs from doctor's house telangana
ليست هناك تعليقات:
إرسال تعليق