ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ దుర్ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలాంటి దుర్ఘటనలో జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. దీనికి కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత పూర్తి విచారణ చేపట్టాలని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ "నిన్నా, మొన్న పెద్ద ఎత్తున తుపాను వచ్చినా ప్రాణాలు కాపాడాలని ప్రయత్నం చేసాం. ఇద్దరు చనిపోయారు. ఈరోజు ప్రైవేటు వ్యక్తి ఏర్పాటు చేసిన కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. చాలా బాధాకరం. ప్రాణాలు చాలా విలువైనవి. మనం కూడా బాధ్యతగా ఉండాలి. ఇందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మ శాంతి కలగాలి. మనమందరం నిమిత్తమాత్రులం" అని అన్నారు.
కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై నిర్వాహకుల అరెస్టుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
السبت، 1 نوفمبر 2025
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has ordered the arrest of the organizers of the Kasibugga stampede stampede that took place at the Venkateswara Temple
ليست هناك تعليقات:
إرسال تعليق