జెమిమా రోడ్రిగ్స్ పై నటి కస్తూరి తీవ్ర విమర్శలు

السبت، 1 نوفمبر 2025

Actress Kasturi slams Jemima Rodrigues cinema cricket saying "Thank you Jesus" sports This means that Christian players take it for granted

t f B! P L


హిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో భారత్ ని విజయపథంలో నడిపించిన జమీమాపై నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ తీవ్ర విమర్శలు చేసింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ముగిసిన అనంతరం జెమిమా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ “జమీమాని దేవుడు ఆశీర్వదించాలి. కానీ నాకు ఒక సందేహం. ఒకవేళ ఎవరైనా రాముడి పేరు మీద లేదా హరి హర మహాదేవ్, సత్ శ్రీ అకాల్ అని చెబితే ప్రజల ప్రతిస్పందన ఎలా ఉండేది? ఎవరైనా అలా చేస్తారా” అని ట్వీట్ చేశారు. అంటే క్రైస్తవ ఆటగాళ్లు “ఏసుకి ధన్యవాదాలు” అంటే అది సహజంగా తీసుకుంటారు. కానీ హిందూ లేదా సిక్కు ఆటగాళ్లు తమ మతపరమైన నినాదాలు చేస్తే ఊరుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో గెలిచిన అనంతరం జమీమా మాట్లాడుతూ ” నేను జీసస్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జీసస్ నన్ను ముందుకు నడిపించాడు. నేను సొంతంగా పోరాడలేకపోయాను. ఆ జీసస్ నన్ను భరించాడు. గత  నాలుగు నెలలు నాకు చాలా కఠినంగా గడిచింది. ఇప్పుడు నాకు ఇదంతా ఓ కలలా అనిపిస్తుంది. నేను సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించాలనే ఆలోచనే నా మైండ్ లో ఉంది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు” అని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో జెమీమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనియాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలపై పలు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా హిందూ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెని టీం ఇండియా నుండి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ