ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సింగిల్ ప్రీమియంతో ఈహెచ్ఎస్ అమలు

السبت، 1 نوفمبر 2025

2020 Andhra Pradesh APS RTC Retired Employees to be Implemented with Single Premium EHS implemented for those who retire after January 1

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 తర్వాత రిటైరైన వారికి ఈహెచ్ఎస్ వర్తింపచేయబోతున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే విశ్రాంతి ఉద్యోగి భార్యకు కూడా జీవితాంతం ఆర్టీసీ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం, మందులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు రూ.38,572 ప్రీమియం చెల్లించాలని, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు రూ.51,429 చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్పత్రుల సిఫారసు మేరకు ఈహెచ్ఎస్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రియంబర్స్‌మెంట్ సౌకర్యం కూడా కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు ఎన్‌ఎంయూ, ఈయూ సంతోషం వ్యక్తం చేశాయి. సీఎం, ఆర్టీసీ ఎండీ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపాయి. 2020కు ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ పథకాన్ని పునరుద్ధరించారు. ఆర్టీసి విలీనానంతరం నిలిపివేసిన రిటైర్డు ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2020కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు REMS స్కీమ్ కింద జీవితకాల వైద్యసదుపాయాలు పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తాజా ఆదేశాలతో 2020కు ముందు, తర్వాత రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాలు చేకూరతాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ