విశాఖలో 100 రూపాయలకే ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ప్రవేశపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ

الثلاثاء، 18 نوفمبر 2025

Andhra Pradesh APSRTC introduces Travel As You Like ticket for just Rs 100 in Visakhapatnam ordinary and metro buses These tickets are available in city

t f B! P L


విశాఖలో ఏపీఎస్ ఆర్టీసీ ట్రావెల్ యాజ్ యు లైక్ పేరుతో కేవలం 100 రూపాయలతోనే రోజంతా నగరంలో ఎక్కడ నుంచైనా, ఎక్కడి వరకైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీంతో మహిళలు ఉచిత బస్సులలో విశాఖ నగరాన్ని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంలోని పురుషుల కోసం కూడా ఈ కొత్త బంపర్ ఆఫర్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా కుటుంబమంతా తక్కువ ఖర్చుతోనే విశాఖ నగరాన్ని చుట్టి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, ఎండాడ బీచ్ వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో బీచ్ కు దానిదైన ప్రత్యేకత ఉంది. ఈ బీచ్ ల మధ్య దూరం కూడా దాదాపు 30కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతేకాదు నగరంలో తొట్లకొండ, ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, సింహాచలం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాంతాలను చూడడానికి కూడా అవకాశం ఉంది. దాదాపు 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విశాఖ నగరంలో కేవలం 100 రూపాయలతోనే రోజంతా ప్రయాణం చేసే అరుదైన అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ టికెట్ ను కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా మాత్రమే కాకుండా, పర్యాటక ప్రాంతాలను సులభంగా సునాయాసంగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల లోపు మాత్రమే పనిచేస్తుంది. విశాఖ నగరంలోని ఏ బస్సు ఎక్కిన కండక్టర్ ను అడిగి ఈ ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లు తీసుకోవచ్చు. సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఈ టికెట్ అందుబాటులో ఉన్నాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ