ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజమైన ఫొటోలను పోలినట్లు ఉండే ఈ నకిలీ ఫొటోలు కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతోన్న ఫొటోల్లో ఏది అసలైనా ఫొటో, ఏది ఏతో చేసిన ఫొటో అనే విషయాన్ని తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. అయితే ఫొటోను గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ చేయడం ద్వారా అది ఏఐ ఫొటోనా, నార్మల్ ఫొటోనో తెలుసుకోవచ్చు. ఫొటోను కాపీ చేసి గూగుల్ సెర్చ్‌లో వేయడం ద్వారా ఆ ఫొటో సోర్స్ ఎక్కడిదన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే గూగుల్ లెన్స్‌లో స్కాన్ చేయడం ద్వారా కూడా ఫొటో అసలా ? నకిలీనా ? తెలుసుకోవచ్చు. ఏఐ ఇమేజ్ డిటెక్టర్ ఫీచర్స్ సహాయంతో కూడా ఫొటో అసలా? ఏఐతో చేశారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం హైవ్ మోడరేషన్, ఆప్టిక్ ఏఐ ఆర్ నాట్, మేబేస్ ఏఐ ఆర్ట్ డిటెక్టర్ వంటి ఇమేజ్ డిటెక్టర్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఇమేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Post a Comment