Ad Code

డొనాల్డ్‌ ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ !


మెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఫ్లొరెడాలోని మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 'నేను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో సమావేశమయ్యాను. ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవసరమైన అనేక అంశాలపై మాట్లాడుకొన్నాం. అక్రమ వలసలు, ఫెంటనిల్‌ స్మగ్లింగ్‌ అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా కార్మికులకు నష్టం కలిగించని వాణిజ్యపరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకొన్నాం. చైనా నుంచి వస్తున్న ఫెంటనిల్‌ కారణంగా మా పౌరులు మాదకద్రవ్యాలకు బాధితులుగా మారడాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశా. ఈ భయంకరమైన వినాశనాన్ని అంతం చేసేలా ట్రూడో మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు' అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ట్రూడో ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు 423 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటిపై 20 లక్షల మంది కెనడా వాసుల ఉద్యోగాలు ఆధారపడ్డాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చాక కెనడా, మెక్సికోలపై అధిక సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. చైనా నుంచి దిగుమతులపైనా 10 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఫ్లొరెడాలోని మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌ లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 'నేను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో సమావేశమయ్యాను. ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవసరమైన అనేక అంశాలపై మాట్లాడుకొన్నాం. అక్రమ వలసలు, ఫెంటనిల్‌ స్మగ్లింగ్‌ అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా కార్మికులకు నష్టం కలిగించని వాణిజ్యపరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకొన్నాం. చైనా నుంచి వస్తున్న ఫెంటనిల్‌ కారణంగా మా పౌరులు మాదకద్రవ్యాలకు బాధితులుగా మారడాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశా. ఈ భయంకరమైన వినాశనాన్ని అంతం చేసేలా ట్రూడో మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు' అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ట్రూడో ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు 423 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటిపై 20 లక్షల మంది కెనడా వాసుల ఉద్యోగాలు ఆధారపడ్డాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారంలోకి వచ్చాక కెనడా, మెక్సికోలపై అధిక సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. చైనా నుంచి దిగుమతులపైనా 10 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu