ఆర్టీపీపీ బూడిద తరలింపునకు సంబంధించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయంలో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. బాహాటంగా గొడవలకు దిగడం ఏంటని, సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా? అని ప్రశ్నించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించేందుకేనని అస్మిత్‌రెడ్డి సమాధానం చెప్పగా కార్యకర్తలను తాను చూసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.
జేసీ అస్మిత్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం !
الأحد، 1 ديسمبر 2024
Andhra Pradesh ఆర్టీపీపీ బూడిద తరలింపునకు సంబంధించి జేసీ అస్మిత్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం బాహాటంగా గొడవలకు దిగడం ఏంటని సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా?
ليست هناك تعليقات:
إرسال تعليق