ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు.13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులు, మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో రేవ్ పార్టీ బయటపడింది. గోదావరి జిల్లాలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఈ రేవ్ పార్టీలో అందరూ మద్యం సేవించారని, డ్రగ్స్ వాడలేదని రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాత్రి అంతా నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకుని, డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులకు వచ్చిన సమాచారం మేరకే పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు.
రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం !
الاثنين، 30 ديسمبر 2024
Andhra Pradesh నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు రేవ్ పార్టీని ఏర్పాటు రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం
ليست هناك تعليقات:
إرسال تعليق