ఉక్రెయిన్‌కు డెన్మార్క్ మరోసారి సాయం అందించింది. రెండో విడతలో ఎఫ్- 16 యుద్ధ విమానాలను పంపించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న జెలెన్‌స్కీ అగ్ర నాయకులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే డెన్మార్క్ అందించిన సాయం గురించి తెలిపారు. ''తొలి విడతలో డెన్మార్క్ అందించిన యుద్ధ విమానాలు రష్యా క్షిపణులను కూల్చివేస్తున్నాయి. ఇప్పుడు మా ఆయుధాల నిల్వ మరింత బలోపేతం అయింది. మా మిత్ర దేశాలన్నీ కలిసి ఉక్రెయిన్‌కు సాయం చేస్తే.. ఇప్పటివరకు రష్యా చర్యలను పూర్తిగా నిలువరించే అవకాశం ఉండేది'' అని పేర్కొన్నారు. ఇతర మిత్ర దేశాలు కూడా తమకు సాయం చేయాలని కోరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజంగా శాంతిని కోరుకోవడం లేదని ఆరోపించారు. కాగా.. రెండేళ్ల పైగా నుంచి ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తోంది. మిత్ర దేశాల సాయంతో శత్రు దేశం చేస్తున్న దాడులను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. అయితే.. రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం తీవ్రరూపం దాల్చొచ్చన్న భయాందోళనల మధ్య అమెరికా ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్డ్‌వార్ ముగిసే సమయానికి బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల కంటే అత్యధిక అణ్వాయుధాలు ఉక్రెయిన్ దగ్గరే ఉన్నాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అణ్వాయుధాలను వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే.. వాటిని ఉక్రెయిన్‌కు తిరిగి ఇవ్వబోమని అగ్రదేశం ప్రకటించింది. అలాంటి ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటూ రష్యాపై పోరాడేందుకు మాత్రమే సాయం చేస్తున్నామని తెలిపింది.
ఉక్రెయిన్‌కు ఎఫ్- 16 యుద్ధ విమానాలు !
السبت، 7 ديسمبر 2024
international అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడి ఉక్రెయిన్‌కు ఎఫ్- 16 యుద్ధ విమానాలు డెన్మార్క్ మరోసారి సాయం అందించింది
ليست هناك تعليقات:
إرسال تعليق