హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో నడ్డా ప్రసంగిస్తూ తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 13 రాష్ట్రాల్లో భాజపా, 6 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి పాలిస్తోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో అత్యధిక సీట్లతో విపక్షంలో ఉన్నాం.. ఎన్నికలు ఎక్కడ జరిగినా భాజపా గెలుస్తుందన్నారు. మహారాష్ట్రలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందని తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ''కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోంది. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడిన పార్టీ కాంగ్రెస్. భాజపాతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవలేదు. రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామని మోసం చేసింది. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. రూ.15వేల రైతు భరోసా ఇవ్వలేదు. రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామని మాట తప్పింది. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదు. షాదీ ముబారక్ ద్వారా రూ.లక్ష నగదు, తులం బంగారం ఇస్తమని దగా చేసింది'' అని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సభలో పాల్గొన్నారు.
తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యం !
السبت، 7 ديسمبر 2024
13 రాష్ట్రాల్లో భాజపా 6 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి national telangana తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ليست هناك تعليقات:
إرسال تعليق