శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. ఈ సేల్ నవంబర్ 22 న ప్రారంభం అయింది. డిసెంబర్ 5 వ తేదీ వరకు కొనసాగుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ సహా మరిన్ని స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని శాంసంగ్ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా గెలాక్సీ స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. క్యాష్‌బ్యాక్, నోకాస్ట్ EMI సహా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ వాచ్ అల్ట్రా స్మార్ట్‌వాచ్‌లతోపాటు గెలాక్సీ బడ్స్ FE, గెలాక్సీ బడ్స్ 3 సహా గెలాక్సీ S మరియు గెలాక్సీ Z సిరీస్ పైన డిస్కౌంట్‌లను పొందవచ్చు. గెలాక్సీ వాచ్ 7 ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 40mm వేరియంట్ ను రూ.29,999, అదే 44mm వేరియంట్ ను రూ.32,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ.8,000 వరకు క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. గెలాక్సీ వాచ్ 7 ఫాల్ డిటెక్షన్ ఫీచర్ సహా బయోయాక్టి్వ్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి, స్లీప్ ప్యాట్రన్‌ను పర్యవేక్షిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా మోడల్ ను రూ.59,999 కు కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అల్ట్రా వేరియంట్ 3nm Exynos చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 1.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్ అనేక హెల్త్ సెన్సార్‌లతో అందుబాటులో ఉంది. గెలాక్సీ బడ్స్ 3 ను రూ.14,999 కు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను 24 నెలలపాటు నోకాస్ట్ EMI తో సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు గెలాక్సీ బడ్స్ 3 ప్రో (Galaxy Buds Pro) ధర రూ.19,999 ఉండగా రూ.5,000 క్యాష్‌బ్యా్‌క్‌ను పొందవచ్చు. దీనిపైనా 24 నెలలపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ !
Friday, November 22, 2024
samsung science technology అమెజాన్ క్రోమా ఫ్లిప్‌కార్ట్ రిలయన్స్ డిజిటల్ సహా మరిన్ని స్టోర్‌లలో విజయ్ సేల్స్ శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్
No comments:
Post a Comment