ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శుక్రవారం ఉదయం జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సలైట్లు మరణించారు. ఎన్‌కౌంటర్ గురించి బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) పి సుందర్‌రాజ్ మాట్లాడుతూ "ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ సుక్మాలో డిఆర్‌జితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సలైట్లు మరణించారు. సంఘటన స్థలం నుండి ఎకె -47, ఎస్‌ఎల్‌ఆర్, అనేక ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. శోధన కొనసాగుతోందని తెలిపారు. సుక్మా జిల్లాలోని కొంటా, కిస్టారం ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ సభ్యుల కదలికలపై సమాచారం రావడంతో డీఆర్జీ,సీఆర్ఫీఎఫ్ సిబ్బంది అప్రత్తమైంది. సుక్మా జిల్లాలోని భెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజుగూడ, దంతేపురం, నాగారం, భండార్‌పదర్ గ్రామాల అటవీ కొండల్లో డీఆర్‌జీ టీం జల్లెడ పడుతున్న క్రమంలో.. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సలైట్లు మరణించారు.
0 Comments