Ad Code

గుండెపోటు - అవిసె గింజలు


విసె గింజలు గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన వారు కూడా వీటిని తినాలంటే అంతగా ఆసక్తిని చూపించరు. కానీ అవిసె గింజలను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్త నాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని, దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించవచ్చని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై పలు పత్రాలను కూడా ప్రచురించారు. అందువల్ల అవిసె గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. అవిసె గింజలను నేరుగా తినలేని వారు వాటిని కాస్త పెనంపై వేయించి తినవచ్చు. అవసరం అయితే ఈ గింజలను పొడి చేసి వాటిని ఖర్జూరాలు, తేనెతో కలిపి తినవచ్చు. వాటితో లడ్డూలను చేసుకుని రోజుకు ఒకటి తినవచ్చు. లేదా అవిసె గింజల పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని నిత్యం మనం తినే కూరల్లో కలిపి వాడుకోవచ్చు. లేదా పళ్ల రసాలు, స్మూతీలు, మిల్క్ షేక్‌లు, సలాడ్స్‌లోనూ కలిపి అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నివారించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu