2025లో శామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. హువావేలా చైనాకు మాత్రమే పరిమితం చేయబడిన Mate XS అల్టిమేట్ ఎడిషన్ వలె కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన చాలా ఫోల్డబుల్ ఫోన్లు సింగిల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌లు, అయితే ట్రై-ఫోల్డ్ ఫోన్లు, దాని పేరుకు తగినట్లు మూడుసార్లు కాదు, రెండుసార్లు మడవవచ్చు. అయినప్పటికీ, ఇది పరికరాన్ని మూడు విభిన్న ఫారమ్ ఫ్యాక్టర్‌లలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్లను సాధారణ స్మార్ట్‌ఫోన్, మినీ టాబ్లెట్ మరియు పూర్తి స్థాయి టాబ్లెట్ ల లాగా వాడుకోవచ్చు. శామ్‌సంగ్ ప్రస్తుతం రెండు వేర్వేరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై పని చేస్తుంది. వాణిజ్యపరంగా మొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన మొదటి బ్రాండ్ హువావే అయినప్పటికీ, శాంసంగ్ 2022 లో CES ఈవెంట్ లో ఇటువంటి పరికరాలను అనేక మోడల్ లను ప్రదర్శించింది. శామ్‌సంగ్ కి చెందిన ఇతర ఫోల్డబుల్ ఫోన్ల మాదిరిగానే, ఇది హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లను అందించే ఫ్లాగ్‌షిప్ డివైజ్ కావచ్చు మరియు ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేదా తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ద్వారా అందించబడుతుంది. ఆండ్రాయిడ్ 15 OS ఆధారంగా OneUI 7 తో షిప్ చేయడానికి శాంసంగ్ నుండి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్లలో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర ట్యాగ్‌ను పరిశీలిస్తే, రాబోయే శాంసంగ్ ట్రై-ఫోల్డ్ ధర భారతదేశంలో $2000 లేదా రూ. 2,00,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనాలున్నాయి.
మార్కెట్లోకి శామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ?
الخميس، 24 أكتوبر 2024
science technology మార్కెట్లోకి శామ్‌సంగ్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ? శాంసంగ్ 2022 లో CES ఈవెంట్ లో ప్రదర్శించింది హువావే Mate XS అల్టిమేట్ ఎడిషన్ వలె కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో
ليست هناك تعليقات:
إرسال تعليق