వాట్సాప్ ను ఎక్కువ డివైజ్ లలో యూజ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఫోన్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగిస్తూ, ల్యాప్‌ట్యాబ్ వంటి వాటిని సెకండరీ డివైజ్‌లుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది ఒక సమస్య ఎదుర్కొంటుంటారు. సాధారణంగా వాట్సప్‌లోని చాట్‌లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్ డివైజెస్‌లో సేవ్ చేసే సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే కాంటాక్ట్ ని సేవ్ చేసేలా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఇకపై కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా అవకాశాన్ని తీసుకొస్తున్నారు. కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో వాట్సాప్ యాడ్ చేయాలా? మొబైల్‌లోనూ యాడ్ చేయాలా? అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అయితే మీరు ఈ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దానిని సెలక్ట్ చేసుకొని నెంబర్ సేవ్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్ పోయినా, మొబైల్ మార్చినా వాట్సాప్ లో సేవ్ అయిన నెంబర్స్ అలాగే ఉంటాయి. దీంతో ప్రత్యేకంగా మళ్లీ నెంబర్స్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదట. ఇక వాట్సాప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పర్సనల్ అసిస్టెంట్‌కు కొత్తగా చాట్ మెమొరీ ఫీచర్ ను యాడ్ చేయనున్నారు. దీంతో మీకు సంబంధించిన విషయాలను అది సేవ్ చేసుకొని మీకు సంబంధించిన వివరాలన అందిస్తాయి.
వాట్సాప్‌లో సెకండరీ డివైజ్‌లోనూ కాంటాక్ట్ ని సేవ్ చేసేలా సరికొత్త ఫీచర్ ?
الخميس، 24 أكتوبر 2024
science technology కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునే అవకాశం ఫోన్ పోయినా మొబైల్ మార్చినా వాట్సాప్ లో సేవ్ అయిన నెంబర్స్ అలాగే ఉంటాయి సెకండరీ డివైజ్‌లోనూ కాంటాక్ట్ ని సేవ్ చేసేలా సరికొత్త ఫీచర్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق