ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ తో పాటు ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దుకు ఆమోదం తెలిపింది. శారదపీఠం భూ కేటాయింపుల రద్దుకు ఆమోదం, ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మూడు · ఉచిత. గ్యాస్ సిలిండర్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ నుంచే ఈ పథకం ప్రారంభించనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మొత్తం మూడు సిలిండర్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దుకు మంత్రివర్గం ఆమోదం !
الأربعاء، 23 أكتوبر 2024
Andhra Pradesh ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్ ఉచిత గ్యాస్ సిలిండర్ జీఎస్టీ రద్దుకు మంత్రివర్గం ఆమోదం నాయీ బ్రాహ్మణులకు అవకాశం శారదపీఠం భూ కేటాయింపుల రద్దుకు ఆమోదం
ليست هناك تعليقات:
إرسال تعليق