బీసీసీఐతో సెటిల్మెంట్ కేసులో బైజూస్ కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. ఇటీవల జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించిన రూ.158.9 కోట్ల సెటిల్మెంట్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆ మొత్తం సొమ్మును క్రెడిటార్స్ కమిటీ వద్ద డిపాజిట్ చేయాలని పేర్కొంది. వాస్తవానికి గతంలో తీర్పునిచ్చే సమయంలో ఎన్‌సీఎల్‌టీ తన బుర్రను ఏమాత్రం వాడకుండా బైజూస్ దివాలా పిటిషన్‌ను ముగించిందని బెంచ్ వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్ధివాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన బెంచ్ ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది.బీసీసీఐతో రూ.158.9 కోట్ల బకాయిల సెటిల్‌మెంట్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఈనెల 2న ఆమోదిస్తూ, బైజూస్‌పై దివాలా ప్రొసీడింగ్స్‌ను పక్కనపెట్టాల్సిందిగా ఆదేశించింది. ఇది బైజూస్‌కు పెద్ద ఊరటగా నిలిచింది. కంపెనీ అధిపతి బైజూ రవీంద్రన్ చేతికి పగ్గాలు అందించేందుకు మార్గం సుగమం చేసింది. అయితే ఇది ఎంతోకాలం నిలవలేదు. ఇప్పటికే సదరు ఎడ్‌టెక్ సంస్థకు అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఓ రుణదాత. అది ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 14న ఈ తీర్పుపై స్టేను మంజూరు చేసింది. తాజాగా బీసీసీఐ ఆ సొమ్మును రుణదాతల కమిటీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ホーム
/
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆ మొత్తం సొమ్మును క్రెడిటార్స్ కమిటీ వద్ద డిపాజిట్ చేయాలి
/
ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన సెటిల్మెంట్ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ !
الأربعاء، 23 أكتوبر 2024
BCCI business national ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన సెటిల్మెంట్ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆ మొత్తం సొమ్మును క్రెడిటార్స్ కమిటీ వద్ద డిపాజిట్ చేయాలి
ليست هناك تعليقات:
إرسال تعليق