తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు త్వరలో బియ్యం ఎగుమతి చేయనున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పౌర సరఫరాల భవన్ నుంచి ఫిలిప్పీన్స్‌ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి రోజేర్స్‌తో ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాణ్యత పరమైన కారణాల వల్ల గత కొన్నేళ్లుగా భారత్‌ నుంచి ఫిలిప్పీన్స్‌ బియ్యం దిగుమతి చేసుకోవడం లేదనే విషయం ప్రస్తావనకు వచ్చిందని మంత్రి అన్నారు. తెలంగాణలో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరగడంతో పాటు నాణ్యత మెరుగుపడినందున బియ్యం ఎగుమతిపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.

Post a Comment

Previous Post Next Post