శబరిమల దర్శనంపై పినరయ విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది.మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న వేళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది. శనివారం సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
0 Comments