మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బాలెనో మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్‌లో బాలెనో సాధారణ మోడల్‌కు భిన్నంగా ఉండే అప్‌డేట్‌లు ఉన్నాయి. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, “ఈ పండుగ సీజన్‌ను మా కస్టమర్‌లకు మరింత ఉత్సాహంగా, ఆనందదాయకంగా మార్చడానికి.. మేము కొత్త బాలెనో రీగల్ ఎడిషన్‌ను రూపొందించాము. ఇది ఆకర్షణీయమైన ఇంటీరియర్‌లను కలిగి ఉంది. ప్రత్యేకమైన స్టైలింగ్‌తో మెరుగుపరచబడింది.” అని తెలిపారు. ఎక్ట్సీరియర్ గురించి చెప్పాలంటే.. మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌లో గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, బ్యాక్ డోర్ గార్నిష్, బాడీ-సైడ్ మోల్డింగ్, డోర్ వైజర్ వంటి టూల్స్ అందించారు. అంతేకాకుండా.. కొత్త సీట్ కవర్లు, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, విండో కర్టెన్లు మరియు ఆల్-వెదర్ 3డీ ఫ్లోర్ మ్యాట్‌లను బాలెనో స్పెషల్ ఎడిషన్ క్యాబిన్‌లో చూడవచ్చు. ఆల్ఫా, జీటా, డెల్టా, సిగ్మా వేరియంట్‌లో చూడవచ్చు. ఇందులో సీఎన్జీ, ఆటోమేటిక్ వేరియంట్‌లు కూడా ఉన్నాయి.
0 Comments