తిరుపతి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో అటెండర్ నానా హంగామా సృష్టించాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ డ్రామా నడిపాడు. నకిలీ పత్రాలతో కడప జిల్లాకు చెందిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే మూల పత్రాల పరిశీలన తర్వాతే పెండింగ్ రిజిస్ట్రేషన్ పత్రాలు విడుదల చేస్తానంటూ రిజిస్టర్ చెప్పడంతో అటెండర్ దూషణల పర్వానికి దిగాడు. అంతేకాకుండా మహిళా ఆఫీసర్‌పై దాడికి కూడా యత్నించాడు. తాజా ఘటనపై ఉన్నతాధికారులకు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అటెండర్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడినట్లు ఉద్యోగులు చెప్పారు.
తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్ దౌర్జన్యం !
السبت، 21 سبتمبر 2024
Andhra Pradesh తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్ దౌర్జన్యం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై దౌర్జన్యానికి దిగాడు
ليست هناك تعليقات:
إرسال تعليق