అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై రాహుల్ తొలిసారి స్పందించారు. తన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ''భారతలోని సిక్కు సోదర సోదరీమణులను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడూ తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశం భారత్ కాకూడదా? అమెరికా పర్యటనలో సిక్కులపై నేను చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరిస్తోంది. ఎప్పటిలాగే అసత్యాలు ప్రచారం చేస్తోంది. నిజాన్ని సహించలేకే నా నోరు మూయించాలనుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ భారత్‌లో ఉన్నాయి. దేశ విలువల విషయంలో నేను ఎల్లప్పుడూ గొంతెత్తుతాను'' అని రాహుల్ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు. కాగా ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మత స్వేచ్ఛపైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వాషింగ్టన్ డీసీ శివార్లలోని హండన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన ముందు కూర్చొన్న వారిలో తలపాగాతో ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే వాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. అన్ని మతాలకూ ఇదే పరిస్థితి తప్పడం లేదన్నారు. దేశంలో రాజకీయాల కంటే మత స్వేచ్ఛపైనే పోరాటం కొనసాగుతోందన్నారు. రాహుల్ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పు పట్టింది. భారత్ పరువు తీస్తున్నారని మండిపడింది. విదేశాల్లో నివసిస్తున్న సిక్కు వర్గంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. భాజపా మద్దతున్న ఒక గ్రూప్ దిల్లీలోని సోనియా గాంధీ నివాసం వెలుపల నిరసన చేపట్టింది. తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా స్పందించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
నా వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది !
السبت، 21 سبتمبر 2024
'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు national కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశ విలువల విషయంలో నేను ఎల్లప్పుడూ గొంతెత్తుతాను నా వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది
ليست هناك تعليقات:
إرسال تعليق