బెంగళూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూంలో అమ్మాయిల వీడియోలను రికార్డు చేసిన ఓ విద్యార్థిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల నిందితుడు మొబైల్‌ ఫోన్‌తో వాష్‌రూంలో దృశ్యాలను చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కంప్యూటర్ సైన్స్ చదువుతోన్న ఆ విద్యార్థి మొబైల్ ఫోన్‌తో ఏడు నుంచి ఎనిమిది వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వాటిని తోటి విద్యార్థులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నిర్వాకం గురించి బయటకుచెబితే తమను చంపుతానని బెదిరించినట్లు వారు చెప్పారు. అయితే ఈ వివరాలు బయటకు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరులో ఈ తరహా ఘటనే వెలుగుచూసింది. ఓ ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి మహిళల వాష్‌రూమ్‌లో ఉన్న చెత్తబుట్టలో సెల్‌ఫోన్‌ను ఉంచి, దాన్ని ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచి కెమెరాను ఆన్‌ చేసి పెట్టాడు. కెమెరాకు ఏమీ అడ్డు రాకుండా సంచికి చిన్న రంధ్రం చేసి టాయిలెట్‌ సీట్‌ దిశగా ఉంచారని దీనిని గమనించిన ఓ మహిళ యాజమాన్యానికి వెల్లడించారు. ఎంత ఫేమస్‌ అయిన సంస్థలైనా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె సూచించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావటంతో ఆ నిందితుడిని అరెస్టు చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ