తెలంగాణలో ఐటీఐ లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్టు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వంద నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీ ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపాధి, కార్మిక శాఖ అధికారులతో తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చుతున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ అప్ గ్రేడ్ చేయాలని, సిలబస్ మార్పునకు ఓ కమిటీ నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. అవసరం అయితే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేవిధంగా విధి, విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వంద నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ
السبت، 21 سبتمبر 2024
telangana ఉపాధి ఏటీసీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి కార్మిక శాఖ అధికారులతో తాజాగా సమీక్ష న వంద నియోజకవర్గాల్లో ఐటీఐ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق