భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. టెండర్లను గత ప్రభుత్వమే రూ.3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచిందని వివరించారు. పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని గుర్తు చేశారు. ''రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం. నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా? ఈ ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు మీద రూ.39వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. విమర్శనాత్మకంగా ఉండే విమర్శలు చేయాలని కేటీఆర్‌కు సూచిస్తున్నా. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి. ఖమ్మంలో నాపై పోటీ చేసిన ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఒకటి దక్కించుకున్నారు. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించలేదు. మేం పిలిచిన రీ టెండర్లలో గతంకంటే రూ.54 కోట్లు తక్కువకే బిడ్లు వచ్చాయి'' అని మంత్రి పొంగులేటి వివరించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం !
السبت، 21 سبتمبر 2024
888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ telangana కేటీఆర్ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.8
ليست هناك تعليقات:
إرسال تعليق