బంగ్లాదేశ్ లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆర్మీపాలనకు ససేమిరా అనడంతోపాటు, ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి అవకాశం ఇవ్వొద్దని యువత, విద్యార్థులు హెచ్చరించడంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రిజర్వేషన్లు చిచ్చురాజుకుని రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్ లో పరిస్థితులు మెల్లగా అదుపులోకి వస్తున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడం అధ్యక్షుడు పార్లమెంట్ ను రద్దు చేయడంతో కొత్తగా ఎన్నికలకు మార్గం సుగమమైంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయగా దీనికి నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. బంగ్లాదేశ్ లెప్టినెంట్ జనరల్ గా ఉన్న మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిగా నియమించారు. 1940లో చిట్టగాంగ్ లో జన్మించిన మహ్మద్ యూనస్ ఓ సామాజిక కార్యకర్త. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లా ప్రజలను ఆదుకోవాలని ఎంతో తపించేవారు. వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్వతహాగా బ్యాంకరు, ఆర్థికవేత్త అయిన యూనస్...మైక్రోఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది బంగ్లా ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత ఆయనదే. దీనికి గానూ 2006లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గో కాలెడోనియన్ వర్సిటీకి ఛాన్సలర్ గా పనిచేశారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గానూ సేవలు అందించారు. అందుకే ఆయన అంటే అక్కడి ప్రజలకు ఎంతో గౌరవం. ముఖ్యంగా బంగ్లాదేశ్ యువతో ఎంతో స్ఫూర్తిని నింపిన ఆయనే తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మీ పాలను గానీ, ఆర్మీ మద్దతు ఉండే మరే ప్రభుత్వ పాలనకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పట్టుబట్టి మరీ ఆయన్ను తాత్కాలిక ప్రధానిగా నియమించుకున్నారు. అయితే యూనస్ కూడా హసీనా బాధితుడే. ఆమె నిర్ణయాలు వ్యతిరేకించినందుకు గానూ యూనస్పైనా ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఆరు నెలలు జైలుశిక్ష కూడా అనుభవించి వచ్చాడు.
బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం
الأربعاء، 7 أغسطس 2024
international ఆర్మీపాలనకు ససేమిరా అనడంతోపాటు ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి అవకాశం ఇవ్వొద్దని బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం యువత విద్యార్థులు హెచ్చరించడంతో
ليست هناك تعليقات:
إرسال تعليق