బంగ్లాదేశ్ లో నిరసనకారుల ఒత్తిడికి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ , అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కూడా రాజీనామా చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిరసనకారుల హెచ్చరించడంతో ఆయన రాజీనామాకు "సూత్రప్రాయంగా" అంగీకరించారు. సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించడంతో గవర్నర్ అబ్దుర్ రూఫ్ కూడా పదవి నుండి తప్పుకున్నారు. కొన్ని రోజుల ముందు నలుగురు డిప్యూటీ గవర్నర్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 300 నుండి 400 మంది బ్యాంకు అధికారులు రాజీనామా చేయవలసి వచ్చింది.
బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి రాజీనామా !
السبت، 10 أغسطس 2024
international ప్రధాన న్యాయమూర్తి రాజీనామా బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించడంతో
ليست هناك تعليقات:
إرسال تعليق