కేఫ్ కాఫీ డే పేరిట రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే గ్రూప్ మాతృ సంస్థ కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.228.45 కోట్లు చెల్లించడంలో విఫలమైందంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ సజావుగా సాగేలా మధ్యవర్తిత్వ పరిష్కార నిపుణుడిని ఏర్పాటు చేసింది. రిడీమ్ చేసుకునేందుకు వీలుండే నాన్ కన్వర్ట్‌బుల్ డిబెంచర్ల కూపన్ల పేమెంట్ల చెల్లింపుల విషయంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ విఫలమైన నేపథ్యంలో దివాలా పరిష్కారం ప్రక్రియ ఎదుర్కోవాల్సి వచ్చింది. 2019 మార్చిలో ఫైనాన్షియల్ క్రెడిటర్ రూ.100 కోట్ల విలువైన వెయ్యి ఎన్‌సీడీలకు సబ్‌స్క్రైబ్ చేసుకుంది. ఇందులో భాగంగా డిబెంచర్ హోల్డర్ల కోసం డిబెంచర్ ట్రస్టీగా ఉండేందుకు ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్‌తో కాఫీ డే ఒప్పందం చేసుకుంది. కూపన్ పేమెంట్స్ చెల్లింపుల అంశంలో వివిధ తేదీల్లో కాఫీ డే విఫలమైంది. ఈ క్రమంలో డిబెంచర్ హోల్డర్ల తరఫున డిబెంచర్ ట్రస్టీగా ఉన్న ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ 2020లో కంపెనీకి నోటీసులు జారీ చేయడంతో పాటు ఎన్‌సీఎల్‌టీనీ ఆశ్రయించింది. దీన్ని కాఫీ డే యాజమాన్యం వ్యతిరేకించింది. డిబెంచర్ ట్రీస్టీగా ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ ఆ అధికారం లేదని వాదించింది. 2019 ఫిబ్రవరిలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దివాలా పరిష్కార స్మృతి కింద డిబెంచర్ ట్రస్టీలకూ పిటిషన్ దాఖలు చేసే ట్రస్టీకి దఖలు పడింది. ఈ క్రమంలోనే తాజాగా కాఫీ డే దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. కాఫీ డే యజమాని అయిన వీజే సిద్ధార్థ్ 2019లో జులైలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్‌పై ఇండస్ ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌పై ఇదే ఎన్‌సీఎల్‌టీ బెంచ్ దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు ఆదేశించింది. అయితే, అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది. తర్వాత రెండు కంపెనీలూ ఓ ఒప్పందానికి వచ్చాయి.
కాఫీ డేపై ఎన్‌సీఎల్‌టీ కీలక ఆదేశాలు జారీ !
السبت، 10 أغسطس 2024
karnataka national ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఆదేశాలు కాఫీ డేపై ఎన్‌సీఎల్‌టీ కీలక ఆదేశాలు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق