ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంధ గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు తన కుమారుడు కార్తీక్ (13) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించాలని సూచించారు. ఈ నెల 3న విశాఖ కేజీహెచ్‌లో బాలుడిని చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మూడు నెలల క్రితం కుక్క కరవడంతో అనారోగ్యానికి గురయ్యాడని, వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు కుమారుణ్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆదివారం విశాఖపట్నంలో అరకులోయ బస్సెక్కారు. అరకులోయ రాక ముందే మార్గంమధ్యలోనే కార్తీక్ మృతి చెందాడు. బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు అరకులోయలో బస్సు దిగారు. ఒడిలో కన్నబిడ్డ మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన విలపిస్తూ కూర్చున్నారు. వీరి దయనీయ పరిస్థితిని గమనించిన స్థానికులు తలాకొంత ఆర్థికసాయం చేశారు. ఈ విషయాన్ని అరకు ఎంపీ తనూజారాణి దృష్టికి తీసుకెళ్లగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు.
బస్సులో బిడ్డ మరణంతో తల్లడిల్లిన కన్నపేగు బంధం !
الاثنين، 5 أغسطس 2024
Andhra Pradesh కుక్క కరవడంతో అనారోగ్యానికి గురయ్యాడని బస్సులో బిడ్డ మరణంతో తల్లడిల్లిన కన్నపేగు బంధం వ్యాక్సిన్ వేయించుకోలేదని వైద్యులు గుర్తించారు
ليست هناك تعليقات:
إرسال تعليق