ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ అమలులో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తానని స్పష్టం చేశారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇసుక సరఫరాలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్‌ను డిజిటలైజేషన్ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఇసుకను దోపిడీ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ పై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం !
الاثنين، 5 أغسطس 2024
Andhra Pradesh అక్రమాలు జరిగితే సహించేది లేదు ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశాలు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق