ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి. వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్సెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో సిద్ధారెడ్డిని సస్సెండ్ నుంచి చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడి నిర్ణయంతో వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి. వెంకట సిద్ధారెడ్డిపై వైసీపీ సస్పెన్షన్ వేటు !
الأربعاء، 10 يوليو 2024
Andhra Pradesh నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి. వెంకట సిద్ధారెడ్డిపై వైసీపీ సస్పెన్షన్ వేటు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం
ليست هناك تعليقات:
إرسال تعليق