ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉన్నావ్ పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బస్సు నుంచి బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా గాయపడిన వారికి బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు :18 మంది దుర్మరణం !
الأربعاء، 10 يوليو 2024
Criem Uttar Pradesh పలువురికి తీవ్ర గాయాలు పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు :18 మంది దుర్మరణం బుధవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై
ليست هناك تعليقات:
إرسال تعليق