రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమీర్ పుతిన్ మోడీని సత్కరించారు. 2019లో కూడా మాస్కోలో సెయింట్ కేథరీన్స్ హాల్‌లో ప్రధాని మోడీకి పుతిన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి మోడీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. రష్యా-భారత్ మధ్య స్నేహపూర్వకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మోడీ చేసిన కృషికి గానూ ఈ పురస్కారాన్ని అందించారు. ఈ పురస్కారం స్వీకరించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ  రష్యా అత్యున్నత పౌర పురస్కారంతో తనను సత్కరించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం నా ఒక్కనికి మాత్రమే కాదని, 140 కోట్ల భారత ప్రజల సొంతమని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా-భారత్ మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహం, పరస్పర నమ్మకానికి గౌరవమని అన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా.. పుతిన్ నాయకత్వంతో భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహాకారం మన ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా వెళ్తోందన్నారు.

Post a Comment

أحدث أقدم