తిరుమల టిటిడి ఇఓగా భాధ్యతలు స్వీకరించే సమయంలో వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని సియం చంద్రబాబు ఆదేశించారని ఇఓ శ్యామలరావు పేర్కొన్నారు. తిరుమల స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు మొదలుకొని, లడ్డు ప్రసాదం, భక్తులుకు అందించే అన్నప్రసాదాలు నాణ్యత పెంచాలని సియం చంద్రబాబు ఆదేశించారు ఆన్ లైన్ లో జారీ చేసే దర్శన టిక్కేట్ల జారిలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని సియం ఆదేశించారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలో చాలా లోపాలను గుర్తించామని, సర్వదర్శనం భక్తులకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ సరైన రీతిలో జరగడం లేదని వివరించారు. క్యూ లైనులో వేచి వున్న చంటి బిడ్డలకు పాలు అందించడం లేదని, క్యూ లైనులో వేచివున్న భక్తులుకు కనీస సమాచారం అందించే వ్యవస్థ కూడా లేనట్టు పిర్యాదులు అందాయన్నారు. క్యూ లైనులో నూతనంగా మూడు అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వారంతపు రద్దీ సమయంలో భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణకు యస్వీబిసి సిఇఓకి భాధ్యతలు అప్పగించామని అన్నప్రసాద కాంప్లేక్స్ లో నిత్యం 2 లక్షల మంది భక్తులుకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని ఇఓ శ్యామలరావు తెలిపారు.
తిరుమలలో సర్వదర్శనం భక్తులకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ !
السبت، 20 يوليو 2024
Andhra Pradesh tamilnadu telangana ఇఓ శ్యామలరావు తిరుమలలో సర్వదర్శనం భక్తులకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ నిత్యం 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం
ليست هناك تعليقات:
إرسال تعليق