ホーム
/
technology
/
అక్టోబర్ 1న 'వివో X ఫోల్డ్ 6' విడుదల
الاثنين، 28 سبتمبر 2026
'Vivo X Fold 6' Launch on October 1 12GB RAM + 256GB storage and 12GB RAM + 512GB storage available in two storage configurations internationally business technology
గ్లోబల్ మార్కెట్‌లో 'వివో X ఫోల్డ్ 6'ను విడుదల చేయడానికి వివో కంపెనీ సిద్ధమైంది. లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ ఫోన్ అక్టోబర్ 1న గ్లోబల్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ తర్వాత ఐదు రోజుల్లోనే, అంటే అక్టోబర్ 6న ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతున్నట్లు టెక్ టిప్‌స్టర్లు చెప్తున్నారు. జూన్ నెలలోనే చైనాలో లాంచ్ అయిన ఈ మోడల్, అక్కడ స్టార్టింగ్ ప్రైస్ CNY 7,999 (దాదాపు రూ.1.05 లక్షలు) గా అందుబాటులోకి వచ్చింది. చైనా లాంచ్ తర్వాత దాదాపు నాలుగు నెలలకు ఈ ఫోల్డబుల్ మొబైల్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి ఎంటర్ కానుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభించే ఛాన్స్ ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్ , 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది రానుంది. కలర్ ఆప్షన్స్ చూస్తే ప్రిజమ్ బ్లాక్, నెబ్యులా టీల్ షేడ్స్‌లో లభించవచ్చు. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే చైనా మోడల్ OriginOS 6 Fold తో రాగా, గ్లోబల్ వెర్షన్ మాత్రం లేటెస్ట్ OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. హార్డ్‌వేర్ పరంగా ఈ ఫోన్ టాప్-నోచ్ స్పెసిఫికేషన్స్‌తో వస్తోంది. ఇందులో శామ్‌సంగ్ M14 లూమినస్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన 8.02 ఇంచెస్ ఇంటర్నల్ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉంటుంది. అవుట్‌సైడ్‌లో 6.51 ఇంచెస్ కవర్ డిస్‌ప్లే ఇచ్చారు. ఫోన్ స్మూత్ అండ్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం వివో స్పెషల్‌గా డెవలప్ చేసిన 'డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్' ప్రొసెసర్‌ను ఇందులో ఫిక్స్ చేశారు. కెమెరా సెటప్ విషయంలో ఇది కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనుంది. రేర్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరాతో పాటు, జీస్ APO సర్టిఫైడ్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. దీనికి అదనంగా వివో జీస్ 200mm టెలీకన్వర్టర్ యాక్ససరీకి కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్‌ను కూడా సూపర్ క్లారిటీతో జూమ్ చేసి ఫొటోస్ తీయవచ్చు. ఇందులో 7,000mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ليست هناك تعليقات:
إرسال تعليق