ఐఆర్ఈసీ 2026 కు ఆతిథ్యమిచ్చి సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ నగరం
الاثنين، 28 سبتمبر 2026
and global investment experts—from over 35 countries developers Hyderabad Sets a New Record by Hosting IREC 2026 industry leaders Singapore telangana UAE UK USA
ఏడవ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ ఐఆర్ఈసీ 2026 కు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సదస్సు భారతదేశంలో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2026 సెప్టెంబర్ 25 నుండి 27 వరకు మూడు రోజుల పాటు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌కు అమెరికా, యూకే, యూఏఈ, సింగపూర్ సహా ప్రపంచవ్యాప్తంగా 35కు పైగా దేశాల నుంచి 1500 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలు, డెవలపర్లు , గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు హాజరయ్యారు. ది డోర్ టు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనే ప్రధాన థీమ్‌తో నిర్వహించిన ఈ సదస్సులో రియల్ ఎస్టేట్ రంగంలో రాబోయే ఊహించని మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలు , అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ప్రాప్‌టెక్ , డీప్‌టెక్, సుస్థిర పర్యావరణ అభివృద్ధి వంటి కీలక అంశాలపై అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్, ప్రాప్‌టెక్ అండ్ ఇన్నోవేషన్ షోకేస్, లగ్జరీ ప్రాపర్టీ ఎక్స్‌పో అనే మూడు ప్రధాన విభాగాలు ఒకే వేదికపై కొలువుదీరి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చారిత్రాత్మక వేదికపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్-ఇండియా ఛైర్మన్ సుమంత్ రెడ్డి ప్రస్తుతం భారతదేశానికి చెందిన డెవలపర్లు, రియల్టీ నిపుణులు ,మౌలిక వసతుల ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపుదిద్దుకుంటున్నాయని అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఐఆర్‌ఈసీ సదస్సు భారతీయ రియల్ ఎస్టేట్ సత్వర పురోగతిని, మన దేశ నిర్మాణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిచెప్పేందుకు ఒక ఉత్తమ వేదికగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఐఆర్ఈసీ 2026 ఛైర్ శైలేందర్ సింగ్ ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, అంతర్జాతీయ పెట్టుబడులతో భారతదేశాన్ని అనుసంధానించే అత్యుత్తమ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ మ్యాప్‌లో హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు మరోస్థాయికి చేరడమే కాకుండా, రాబోయే రోజుల్లో భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి, ముఖ్యంగా తెలంగాణ ఇన్‌ఫ్రా విభాగానికి వందలాది కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పారేందుకు మార్గం సుగమమైందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق