రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డికలిశారు. తాడేపల్లిలో తమ పార్టీ ఆఫీసు కూల్చివేతతో పాటు రాష్ట్రంలో ఇతర కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, తమ నేతలపై కేసులు పెట్టడం వంటి వాటిపై ఫిర్యాదు చేశారు. కార్యకర్తలపై దాడుల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ ఫోటో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. తాము గతంలోనూ గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వైసీపీకి ఓట్లు వేసిన వారిపై కూడా దాడులు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ అఫీసుల్లోకి అక్రమంగా చొరబడి బిల్డింగ్స్ కూల్చివేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. వైసీపీ కార్యాలయాలకు నిబంధనల ప్రకారమే స్థలాల కేటాయింపు జరిగిందని చెప్పారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి !
السبت، 29 يونيو 2024
Andhra Pradesh అయోధ్య రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ తాడేపల్లిలో తమ పార్టీ ఆఫీసు కూల్చివేతతో పాటు రాష్ట్రంలో ఇతర కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం
ليست هناك تعليقات:
إرسال تعليق