ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదేల పవన్ కల్యాణ్ కొండగట్టు అజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజరులు పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ స్వామి ముక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించి ప్రసాదం అందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వారాహి వాహనానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ పూజలు చేయించారు. పవన్ పర్యటన దృష్ట్యా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు సిద్ధిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్ అభివాదం చేశారు. ఆ తర్వాత కరీంనగర్ చేరుకున్న పవన్ కల్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బైపాస్ లో పవన్ కు కారు దిగారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను చూడడానికి జనం ఎగబడ్డారు. అంజన్నను దర్శించుకుంటున్న క్రమంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈనేపథ్యంలో అక్కడ భారీగా రద్దీ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు.. వారి చేతివాటాన్ని ప్రదర్శించారు. చైన్, డబ్బులు దొంగిలించారు. పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని పవన్ అభిమానులు చితకబాదారు. దొంగ వద్ద రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో దొంగను పోలీసులకు అప్పగించారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్ !
السبت، 29 يونيو 2024
Andhra Pradesh telangana ఆలయ పూజరులు పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్ సిద్ధిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు
ليست هناك تعليقات:
إرسال تعليق