వైసీపి ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని మర్చిపోవద్దని, మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన, ఈవీఎంల వ్యవహారం పై దేశ వ్యాప్త చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మనకు కష్టాలు కొత్త కాదు, ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామని పిలుపునిచ్చారు. నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడవద్దన్నారు. మళ్ళీ వైసిపి ఉవ్వెత్తున ఎగసి పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలని తెలిపారు.
శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలి !
الخميس، 13 يونيو 2024
40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని మర్చిపోవద్దని Andhra Pradesh వైసీపి ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలి
ليست هناك تعليقات:
إرسال تعليق